మేము అవమానించలేదు అనుకరించామంతే – హరీష్ శంకర్

మేము అవమానించలేదు అనుకరించామంతే – హరీష్ శంకర్

Published on May 22, 2012 10:01 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “గబ్బర్ సింగ్” చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న హరీష్ శంకర్ ఈ చిత్రంలో అంత్యాక్షరి సన్నివేశం చుట్టూ నెలకొన్న వివాదానికి జవాబు ఇచ్చారు.” మేము ఎవరి మీద వ్యంగంగా చేసింది కాదు నాకు రాఘవేంద్ర రావు గారంటే గౌరవం ఉంది అప్పట్లో ఆ పాట చాలా ప్రాచుర్యం పొందింది అప్పటి వరకు విరహగీతాలు పాడుతున్న విలన్ గ్యాంగ్ ని ఊపున్న పాట పాడమంటారు అప్పుడు ఈ పాట పాడటం జరిగింది” అని అన్నారు. “ఒకరిని అనుకరించడానికి అవమానించడానికి చాలా తేడా ఉంది ఇక్కడ మేము అనుకరించం అంతే అవమానించలేదు కాబట్టి నిజానిజాలు పరిశీలించండి” అని కూడా హరీష్ శంకర్ అన్నారు. ఆ సన్నివేశం నుండి జనం ఎలాంటి అభిప్రాయం తీసుకున్న హరీష్ శంకర్ ఉద్దేశం మాత్రం ఇది. ఆయన ఈ విషయాన్నీ దృవీకరించిన వీడియో కొరకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు