బెట్టింగ్ నేఫధ్యంలో సూపర్ స్టార్ కృష్ణ “హరి ఓం”

బెట్టింగ్ నేఫధ్యంలో సూపర్ స్టార్ కృష్ణ “హరి ఓం”

Published on May 9, 2012 9:34 AM IST

సూపర్ స్టార్ కృష్ణ మరియు నిషా కొఠారి ప్రధాన పాత్రలలో క్రికెట్ బెట్టింగ్ ,హార్స్ రేసింగ్ నేఫధ్యంలో రూపొందిన చిత్రం “హరి ఓం”. రమణ లోక్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేష్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో బెట్టింగ్ రేసింగ్ వంటి అంశాలతో పాటు ప్రేమకథ కూడా ఉంటుందని దర్శకుడు తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ పాత్ర ఈ చిత్రం లో ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంతే కాకుండా చిత్రానికి ఆ పాత్రే కీలకమని కూడా చెప్పారు. చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. వచ్చే వారం ఈ చిత్ర ఆడియో మరియు జూన్ మొదటి వారం లో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత ప్రకటించారు. ఈ చిత్రానికి అజయ్ పట్నాయక్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు