కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్ వి.వి.వినాయక్ ల చిత్రం లో హన్సిక రెండవ కథానాయికగా కనిపించబోతుంది అని చెప్పారు. ఇప్పుడు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం నుండి హన్సిక తప్పుకుంది. ఈ పాత్రకు కొత్త హీరోయిన్ ని కాని ఎవరయినా ఎదుగుతున్న అమ్మాయిని కాని ఎంచుకోబోతున్నారు.అధికారిక ప్రకటన కొద్దిరోజుల్లో జరగనుంది.కాజల్ ఈ చిత్రం లో కథానాయికగా చేస్తుంది. రామ్ చరణ్ ఈ చిత్రం లో పూర్తి మాస్ పాత్రలో కనిపించబోతున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి మొదటి వారం లో షూటింగ్ మొదలుపెట్టుకోనుంది. ఒక్క షెడ్యూల్ లో ఈ చిత్రాన్ని ముగించాలని నిర్మాతలు అనుకుంటున్నారు. చరణ్ ప్రస్తుతం సంపత్ నంది “రచ్చ” చిత్రం లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- పోల్ : కింగ్డమ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- ఫోటో మూమెంట్ : రాజాసాబ్ సెట్స్‌లో దర్శకుడు మారుతితో ప్రభాస్ కూల్ లుక్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘తమ్ముడు’
- 24 గంటల్లో భారీ బుకింగ్స్ తో ‘కింగ్డమ్’
- OG ఫస్ట్ బ్లాస్ట్‌కు డేట్ ఫిక్స్.. ఫైర్ స్టోర్మ్ వచ్చేస్తుంది..!
- బాలయ్య, క్రిష్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ టాక్!