కథా నాయకుడు, డార్లింగ్, నాన్న చిత్రాల మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్ కుమార్ త్వరలో ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. అతను గాయని సైంధవిని పెళ్లి చేసుకోబోతున్నాడు. సైంధవి అపరిచితుడు, ఆవకాయ్ బిర్యాని, అవారా, నాన్న వంటి పలు చిత్రాల్లో పాటలు పాడింది. సైంధవి తొమ్మిది సంవత్సరాలుగా ప్రకాష్ కుమార్ ట్రూపులో పాడుతూ వస్తుంది. కొద్ది రోజుల్లోనే వీరు మంచి స్నేహితులయ్యారు. ఆ తరువాత కొద్దిరోజుల్లోనే ప్రేమలో పడ్డారు. ఇటీవలే వీరి ప్రేమకు పెద్దల నుండి అంగీకారం లబించినట్లు తెలిసింది. వచ్చే ఏడాది వీరు పెళ్లి చేసుకోనున్నారు. ప్రకాష్ కుమార్ ఎవరో కాదు ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ గారికి స్వయానా మేనల్లుడు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘హరిహర వీరమల్లు – పార్ట్ 1’ – ఆకట్టుకునే పీరియాడిక్ యాక్షన్ డ్రామా
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- వీడియో : వార్ 2 తెలుగు ట్రైలర్ ( హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్)
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- లోకేష్ కనగరాజ్ కి మాత్రమే ఆ భాగ్యం కల్పించిన రజిని!
- వైరల్: సంధ్య థియేటర్ ‘వీరమల్లు’ స్క్రీనింగ్ వద్ద అకిరానందన్
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!