గౌరవం పక్కా కమర్షియల్ చిత్రం – అల్లు శిరీష్

అల్లు శిరీష్ తన ఆరంగేట్ర చిత్రం “గౌరవం” గురించి కాస్త ఆత్రుతగా వున్నారు. యామి గౌతం ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన నటించనుంది. రాధా మోహన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని ప్రకాశ్ రాజ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ “గౌరవం పక్కా కమర్షియల్ చిత్రం ఈ చిత్రంలో అన్ని రకాల ప్రేక్షకులకు కావలసిన అంశాలున్నాయి తెలుగు మరియు తమిళంలో ఆరంగేట్రానికి ఇది సరయిన కథ” అని చెప్పారు. ఈ రోజు శిరీష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని లాంచనంగా ప్రకటించారు గత కొన్ని నెలలుగా నటన డాన్స్ మరియు ఫైట్స్ లో ముంబైలో శిక్షణ తీసుకున్నారు. చాలా కథలు విన్నాక రాధా మోహన్ చెప్పిన “గౌరవం” కథ నచ్చి ఈ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం మైసూరు లో జూన్ 18న మొదలు కానుంది. తమన్ సంగీతం అందించనున్నారు.

Exit mobile version