మొగుడు సినిమాతో నాకల నెరవేరింది : గోపీచంద్

Gopichand Mogudu

కృష్ణవంశీ తో పనిచేసేందుకు పదేళ్లుగా వేచి చూస్తున్నానని నటుడు గోపీచంద్ తెలిపారు.ఇంత కాలానికి నా నిరీక్షణ ఫలించిందన్నారు. “తొలి వలపు” సినిమాతో తెలుగు సినిమా అరంగేట్రం చేసిన గోపీచంద్ తాను అవకాశం కోసం ఇద్దరు దర్శకులను మాత్రమే కలిసానన్నారు. అందులో ఒకరు కృష్ణవంశీ కాగా మరొకరు తేజ. తనకు తేజ “జయం” అందించగా, కృష్ణవంశీ తో పని చేయటానికి పది సుదీర్ఘ సంవత్సరాలు హోల్డ్ లో ఉండాల్సి వచ్చిందన్నారు.
కృష్ణవంశీ తో కలసి పనిచేయటం పై గోపిచంద్ ఇలా స్పందించారు. “ఆయన ఒక సంస్థ. అతనితో పనిచేస్తున్నప్పుడు ఆర్జించే జ్ఞానం అపారం. దర్శకునిగానే కాక, సంగీతం, సాహిత్యం, పాటల చిత్రీకరణలో అతని ప్రతిభ చెప్పనలవి కాదు”. ‘మొగుడు’ సినిమా గురించి మాట్లాడుతూ బలమైన కుటుంభం మరియు మానవ సంబంధాల నేపధ్యంతో సాగే ఈ చిత్రం ప్రేక్షకుల మనసుకు వెంటనే హత్తుకు పోతుందని అభిప్రాయపడ్డారు.
అయితే…,’మొగుడు’ సినిమా నవంబర్ 4 వ తేదీన విడుదల కాబోతుంది.

Exit mobile version