రామ్ గోపాల్ వర్మని పొగడ్తలతో ముంచెత్తుతున్న గౌతం మీనన్

రామ్ గోపాల్ వర్మని పొగడ్తలతో ముంచెత్తుతున్న గౌతం మీనన్

Published on May 9, 2012 11:26 PM IST

గౌతం మీనన్ ఈ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. ఎప్పుడయితే రామ్ గోపాల్ వర్మ తన రాబోతున్న చిత్రం “డిపార్టుమెంటు” మేకింగ్ వీడియో విడుదల చేశారో పలువురు దర్శకులు రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. తాజాగా వీరిలోకి గౌతం మీనన్ చేరారు ” అన్ని రూల్స్ ని ధ్వంసం చేసి కొత్త విధానాలను ప్రవేశ పెట్టారు మీరు చిత్రం తెరకెక్కించిన విధానం చూస్తుంటేనే చిత్రం చూడాలి అనిపిస్తుంది” అని అన్నారు. రామ్ గోపాల్ వర్మ లానే గౌతం మీనన్ చిత్రంలో కూడా సినిమాటోగ్రఫికి చాలా ప్రాదాన్యత ఉంటుంది. తన రాబోతున్న చిత్రం “ఎటో వెళ్లిపోయింది మనసు” చిత్రం కూడా అంచనాలను పెంచేలానే ఉంది. రామ్ గోపాల్ వర్మ నుండి నేర్చుకున్న విషయాలను భవిష్యత్తులో గౌతం మీనన్ ఉపయోగిస్తారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు