“గబ్బర్ సింగ్” చిత్రం ఒక ఆపలేని శక్తి గా మారుతుంది ఆడియో విడుదలయ్యి ఒక రోజు పూర్తి కాకుండానే మొదటి విడత విడుదల చేసిన సిడిలలో ఎనబై శాతం అయిపోయాయి చాలా ప్రాంతాలకు రెండవ విడత స్టాక్ పంపారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అందులో ఎనేర్జి జనంలోకి దూసుకెళ్లింది. ఇది చూస్తుంటే ఈ చిత్ర విడుదలకు ముందే పలు రికార్డ్ లను బద్దలు కొట్టేలా ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటించారు. గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం మాలిక అరోరాతో హరీష్ శంకర్ హైదరాబాద్ లో “కెవ్వు కేక” పాటను చిత్రీకరిస్తున్నారు.