అమెరికా నుండి అమలాపురం వరకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ కొట్టిన గబ్బర్ సింగ్

అమెరికా నుండి అమలాపురం వరకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ కొట్టిన గబ్బర్ సింగ్

Published on May 10, 2012 11:52 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ ఈ రోజు విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకున్న సందర్భంగా ఈ చిత్ర బృందం సక్సెస్ షేర్ చేసుకోవడానికి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఈ చిత్ర పంపిణీదారుడు దిల్ రాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ అనే సినిమా ప్రారంభం కాకముందే నేను ఈ సినిమా పంపిణీ చేస్తానని ఈ చిత్ర నిర్మాత గణేష్ బాబు చుట్టూ 6 నెలలు తిరిగాను. పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ ‘తొలిప్రేమ’ మరియు ‘ఖుషి’ సినిమాల్ని మా సంస్థ ద్వారానే విడుదల చేసాం. ఆ రెండు సినిమాలు హైదరాబాదులోని సంధ్య థియేటర్లో వేయడం జరిగింది. అదే సెంటిమెంట్ కొనసాగిస్తూ ఈ సినిమాని కూడా అదే థియేటర్లో వేసి మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాము. గబ్బర్ సింగ్ చిత్రానికి అమెరికా నుండి అమలాపురం వరకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంది అన్నారు. చిత్ర నిర్మాత గణేష్ బాబు మాట్లాడుతూ అన్ని ఏరియాల నుండి అందరూ ఫోన్లు చేసి అభినందనలు చెబుతుంటే ఆనందంగా ఉంది. నా జీవితంలో ఇది మరిచుపోలేని రోజు. పవన్ కళ్యాణ్ అభిమానులకి విజ్ఞప్తి దయచేసి పైరసీని అరికట్టి సినిమాని కాపాడాలని కోరారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు