ఇంకా తగ్గని “గబ్బర్ సింగ్” వసూళ్లు

ఇంకా తగ్గని “గబ్బర్ సింగ్” వసూళ్లు

Published on May 18, 2012 3:25 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “గబ్బర్ సింగ్” చిత్రం ఇప్పటికీ పలు చోట్ల శక్తివంతమయిన వసూళ్లను రాబట్టుతుంది ఈ చిత్ర డిమాండ్ ఇంకా కొనసాగుతుంది. ఈ చిత్రం పరిశ్రమలో పలు రికార్డ్లను బద్దలు కోట్టబోతుంది.ఈ వారం మరో పెద్ద చిత్రం లేకపోవటం ఈ చిత్రానికి కలిసి వచ్చిన విషయం. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గణేష్ బాబు నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు ఈయన అందించిన సంగీతం ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. సల్మాన్ ఖాన్ “దబాంగ్” చిత్ర రీమేక్ అయిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటించింది. పొగరున్న పోలీసు పాత్రలో పవన్ కళ్యాణ్ నటన చిత్ర ప్రేమికులను మరియు అభిమానులను పెద్ద సంఖ్యలో థియేటర్లకు తీసుకు వస్తుంది.

తాజా వార్తలు