జెనిలియా మీద ఎఫ్ ఐ ఆర్ నమోదు?

జెనిలియా మీద ఎఫ్ ఐ ఆర్ నమోదు?

Published on Mar 19, 2012 7:58 PM IST

హైదరాబాద్ లో జరిగిన 250 కోట్ల భూ కుంబకోణంలో జెనిలియా పేరు వినిపిస్తుంది. ఆరేళ్ళ క్రితం జెనిలియా ఒకానొక రియల్ ఎస్టేట్ సంస్థకి ప్రచారం కోసం ఒక ఫోటో షూట్ చేసింది వారి హోర్డింగ్స్,ప్రచార పత్రాల మీద తన ఫోటో ప్రచురించారు . తిరుపతయ్య అనే ఒక వ్యక్తి ఈ సంస్థ నుండి జెనిలియా ప్రచారకర్తగా ఉన్న సమయం లో హైదరాబాద్ శివార్లలో కొంత భూమిని కొనుగోలు చేశారు. తరువాత ఆ సంస్థ నుండి ఎటువంటి కదలిక లేకపోవటంతో తిరుపతయ్య జెనిలియాతో పాటు సంస్థకు చెందిన ఆరుగురు మీద కేసు నమోదు చేశారు ఈ సంఘటనతో జెనిలియా కాస్త దిగ్భ్రాంతి చెందారు. తన న్యాయవాది మాట్లాడుతూ ఫోటోషూట్ తరువాత ఆ సంస్థతో జెనిలియాకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు.

తాజా వార్తలు