ప్రత్యేకం: ఎందుకంటే ప్రేమంట విడుదల తేది ఖరారు

ప్రత్యేకం: ఎందుకంటే ప్రేమంట విడుదల తేది ఖరారు

Published on Mar 30, 2012 8:45 PM IST

యంగ్ హీరో రామ్ మరియు మిల్కీ బ్యూటి తమన్నాలు ప్రధాన పాత్రలలో కనిపించబోతున్న చిత్రం “ఎందుకంటే ప్రేమంట”. ఈ చిత్ర విడుదల తేది ఖరారు అయ్యింది. ఈ చిత్రం ఈ మే 31న విడుదల కానుంది. ఈ విషయాన్నీ నిర్మాత దృవీకరించారు.కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చాలా బాగా వచ్చిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. జి.వి.ప్రకాశ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని స్రవంతి రవి కిషోర్ నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ యువతలో మంచి అంచనాలు పెరిగేలా చేసింది. రామ్ మరియు తమన్నాల మధ్య కెమిస్ట్రీ అద్బుతంగా కుదిరినట్టు కనిపిస్తుంది. ఈ వేసవికి వేచి చూస్తున్న చిత్రాలలో ఇది కూడా ఒకటిగా ఉండబోతుంది.

తాజా వార్తలు