బంపర్ ధర పలికిన ఈగ తమిళ శాటిలైట్ హక్కులు

బంపర్ ధర పలికిన ఈగ తమిళ శాటిలైట్ హక్కులు

Published on May 15, 2012 8:00 PM IST

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి “ఈగ” విడుదలకి ముందే సంచలనాలు సృష్టిస్తుంది. ఈ చిత్రం తమిళ శాటిలైట్ హక్కులను సం నెట్ వర్క్ 3.35 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సంఘటనే ఈ చిత్రం మీద ఉన్న అంచనాలను తెలుపుతుంది. ఈ చిత్ర తమిళ హక్కులను పివిపి సినిమాస్ సొంతం చేసుకుంది ఈ చిత్రం 30 న విడుదలకు సిద్దమయ్యింది. సమంత, నాని,సుదీప్ లు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. వారాహి చలన చిత్రం బ్యానర్ మీద బెల్లం సాయి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా సురేష్ బాబు ఎగ్జిక్యుటివ్ నిర్మాత.

తాజా వార్తలు