దమ్ము అధికారక లోగో ఆవిష్కరణ

దమ్ము అధికారక లోగో ఆవిష్కరణ

Published on Mar 6, 2012 7:27 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మాస్ మసాల ఎంటర్టైనర్ ‘దమ్ము’ చిత్రానికి సంభందించిన లోగోని ఈ రోజు అధికారికంగా ధ్రువీకరించారు. ఈ చిత్రానికి సంభందించిన ప్రొడక్షన్ టీం వారు తమ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా విడుదల చేసారు. ప్రస్తుతం దమ్ము చిత్రానికి సంభందించిన కీలక సన్నివేశాలు దర్శకుడు బోయపాటి ఇంట్లో ముఖ్య తారాగణంతో చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ మరియు త్రిషా కూడా ఈ సన్నివేశాల్లో పాల్గొన్నారు. ఏప్రిల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర ఆడియో ఈ నెల 23న విడుదల చేయబోతున్నారు.

తాజా వార్తలు