యాక్షన్ హీరో యంగ్ టైగర్ ఎన్టీయార్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ “దమ్ము” ఈ ఏప్రిల్ కి విడుదల అవ్వటానికి సకలం సిద్దమయ్యింది చిత్రంలో చివరి పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది. చివరి షెడ్యూల్ ఈ నెల 26 నుండి మొదలు కాబోతుంది ఈ షెడ్యూల్ కోసం భారీ సెట్ ను నిర్మించారు. దీనితో ఈ చిత్ర చిత్రీకరణ మొత్తం పూర్తి అవుతుంది. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు త్రిష మరియు కార్తీకలు ప్రధాన పాత్రలలో కనిపించబోతున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం అందిస్తున్నారు. అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమ్మర్శియల్స్ బ్యానర్ మీద కే.ఎస్.రామారావు సమర్పిస్తున్నారు.