డేవిడ్ బిల్లా విడుదల తేది ఖరారు

డేవిడ్ బిల్లా విడుదల తేది ఖరారు

Published on May 17, 2012 2:32 AM IST

అజిత్,బ్రూణ అబ్దుల్లా మరియు ఒమనకుట్టన్ ప్రధాన పాత్రలలో నటించిన “డేవిడ్ బిల్లా” చిత్రం జూన్ 8న విడుదల కావడానికి సిద్దమయ్యింది. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రం తమిళంలో “బిల్లా -2” గా విడుదలవుతుండగా తెలుగులోకి “డేవిడ్ బిల్లా” గా ఎస్.వి.ఆర్ ప్రైవేటు లిమిటెడ్ డబ్బింగ్ చేస్తున్నారు. శోభారాణి ఈ చిత్రాన్ని తెలుగులో సమర్పిస్తున్నారు. ” చక్రి తోలేటి బృందం ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు ఈ చిత్రం హాలివుడ్ చిత్రం లాగా కనిపిస్తుంది దీని వెనక వారి కృషి ఎంతో ఉంది. ఐరోపా దేశాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నాయి” అని శోభ రాణి అన్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజ సంగీతం అందించారు ఈ చిత్ర తెలుగు వెర్షన్ ఆడియో మే 26న విడుదల కానుంది.

తాజా వార్తలు