దరువు చిత్రం కోసం దర్శకుడు శివ భారీ పారితోషకం

మాస్ మహారాజ రవితేజ రాబోతున్న చిత్రం “దరువు” చిత్రం కోసం దర్శకుడు శివ భారీగానే పారితోషకం తీసుకున్నారు. మా వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం దర్శకుడు శివ రెండు కోట్లకు పైనే పారితోషకం అందుకున్నట్టు సమాచారం. ఇంకా కెరీర్ మొదటి దశలోనే ఉన్న ఈ దర్శకుడు ఇంత మొత్తం పారితోషకం అందుకోవటం ఆశ్చర్యకరమయిన విషయమే. రవి తేజ కూడా శివ పనితనంతో సంతృప్తి పొందినట్టు సమాచారం. చిత్రం అద్బుతంగా వచ్చిందని వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రానికి విజయ్ అంథోని సంగీతం అందించగా బూరుగుపల్లి శివరామ కృష్ణ నిర్మిస్తున్నారు. తాప్సీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం సోషియో ఫాంటసి చిత్రంగా తెరకెక్కుతుంది. తమిళ నటుడు ప్రభు ఈ చిత్రంలో యముడిగా కనిపించబోతున్నారు. మే 4న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యటానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version