మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ‘దరువు’ రేపు ప్రసాద్ ల్యాబ్లో విడుదల కానుంది. విజయ్ అంటోని సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సోషియో ఫాంటసి చిత్రంగా తెరకెక్కుతుంది. సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా ఎదిగి గతంలో శౌర్యం, శంఖం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా రవితేజ సరసన తాప్సీ హీరొయిన్ గా నటిస్తుంది. బూరుగుపల్లి శివ రామకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు ప్రభు యమధర్మ రాజుగా నటించబోతున్నాడు. దరువు చిత్రం అన్ని హంగులూ పూర్తి చేసుకుని మే 4న విడుదలకు సిద్ధమవుతుంది.