పొల్లాచ్చి లో “దమ్ము” నూతన షెడ్యూల్

పొల్లాచ్చి లో “దమ్ము” నూతన షెడ్యూల్

Published on Jan 6, 2012 2:08 AM IST

యంగ్ టైగర్ ఎన్ .టి.ఆర్ నటిస్తున్న చిత్రం “దమ్ము” చిత్రీకరణ వేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతుం ఈ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్ శివార్లలో జరుగుతుంది. ఈ నెల 26 న చిత్ర బృందం పొల్లాచ్చి కి పోతున్నట్టు సమాచారం గతం లో కూడా ఒకసారి పొల్లాచ్చి కి వెళ్లి వాతావరణం సహకరించకపోవటం తో చిత్రీకరణ జరపకుండా తిరిగి వచ్చేసారు. త్రిష కథానాయికగా చేస్తుండగా కార్తీక మరో కథానాయికగా చేస్తుంది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా అలెగ్జాండర్ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు క్రియేటివ్ కమర్షియల్స్ పతాకం పై కే.ఎస్.రామా రావు సమర్పిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. సంక్రాంతి కి “ఫస్ట్ లుక్” విడుదల చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు