యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దమ్ము ఆడియో విడుదల ఖరారైంది. ఎమ్ఎమ్ కీరవాణి అందించిన ‘దమ్ము’ చిత్ర ఆడియో మార్చి 23న విడుదలకు సిద్ధమైంది. ఈ ఆడియో వేడుకకు శిల్ప కళా వేదిక సిద్ధమవుతోంది. ఈ వేడుకకను ఎన్టీఆర్ అభిమానుల కోసం భారీగా సిద్ధం చేయనున్నారు. ఈ రోజు విడుదలైన స్టిల్స్ ఫ్యాన్స్ లో అంచనాలు రెట్టింపు చేసాయి. ఎన్టీఆర్ పవర్ఫుల్ లుక్ తో ఈ చిత్రంలో కనిపించనున్నారు. త్రిషా మరియు కార్తీక నాయర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అలెగ్జాన్డర్ వల్లభ నిర్మిస్తున్నారు.