ప్రవీణ్ శ్రీ ‘కాళి చరణ్’లో చైతన్య కృష్ణ

ప్రవీణ్ శ్రీ ‘కాళి చరణ్’లో చైతన్య కృష్ణ

Published on Mar 18, 2012 5:12 PM IST

వెన్నెల ఒన్ అండ్ హాఫ్ సినిమాలో హీరోగా నటిస్తున్న చైతన్య కృష్ణ ‘కాళి చరణ్’ అనే మరో సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో జగపతి బాబుతో గాయం – 2 అనే సినిమా తీసిన ప్రవీణ్ శ్రీ ఈ చిత్రానికి దర్శకుడు. చైతన్య కృష్ణ ఇంతకు ముందు ‘స్నేహగీతం’, అది నువ్వే’, ‘నిన్ను కలిసాక’ వంటి చిత్రాల్లో నటించాడు. నందిని రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ‘అలా మొదలైంది’ సినిమాలో అతిధి పాత్ర పోషించాడు. ప్రముఖ జాతీయ పత్రికతో ప్రవీణ్ శ్రీ ఈ విషయాన్నీ ధ్రువీకరించాడు. చైతన్య కృష్ణ చేసిన పలు షార్ట్ ఫిల్మ్స్ చూసిన ప్రవీణ్ చైతన్య ప్రతిభ నచ్చి తన తరువాత సినిమా కోసం ఎంచుకున్నాడు. పూర్తి కమర్షియల్ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని చత్తీస్గడ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తారు.

తాజా వార్తలు