రాము ని ఆకట్టుకున్న బ్రెజిలియన్ సుందరి

గతం లో ఊర్మిళ తన అభిమాని నటి అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ తరువాత ఆంత్ర మాలి కొన్నాళ్ళు తరువాత నిషా కొటారి ఇప్పుడు కోత్తగా బ్రెజిలియన్ సుందరి నటాలియా ఫినేరో గురించి అన్నారు. కింగ్ ఫిషేర్ టైటిల్ గెలుచుకున్న ఈ భామ తరువాత తన పేరుని నటాలియ కౌర్ గా మార్చుకుంది. ప్రస్తుతం డిపార్టుమెంటు లో ఒక ఐటెం సాంగ్ చేస్తున్న ఈ నటి గురించి రామ్ గోపాల్ వర్మ ఒక ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ ” నేను గత పది సంవత్సరాలలో ఇలాంటి అమ్మాయిని ఎప్పుడు చూడలేదు తన హావ భావాలు తన ఆహార్యం అన్ని చాలా బాగుంటాయి” అని అన్నారు. ప్రస్తుతం రానా,సంజయ్ దత్ మరియు నటలియా ల మీద ఐటెం సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ పాట అన్ని ఐటెం సాంగ్ లను “ఖల్లాస్” చేస్తుందని కూడా రామ్ గోపాల్ వర్మ అన్నారు.

Exit mobile version