కే.బి.సి.లో మళ్ళి కనపడబోతున్న అమితాబ్ బచ్చన్

కే.బి.సి.లో మళ్ళి కనపడబోతున్న అమితాబ్ బచ్చన్

Published on Jan 2, 2012 8:29 PM IST

భారత దేశం లో బాగా ప్రాచుర్యం పొందిన కథానాయకులలో అమితాబ్ బచ్చన్ ఒకరు. అయన గుర్తింపు మరియు అయన స్టైల్ “కౌన్ బనేగా కరోడ్ పతి” కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. ఈ కార్యక్రమం లో సాధారణ అభిమాని ఒక సూపర్ స్టార్ ముందు కూర్చుని మాట్లాడే అవకాశం ఉండటం అందరిని ఆకట్టుకుంది. దశాబ్ద కాలం సాగిన ఈ కార్యక్రమం అప్పట్లో ఒక సంచలనం మళ్ళి ఇప్పుడు బచ్చన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సమాచారం ప్రకారం బచ్చన్ మూడు సంవత్సరాలు సోనీ వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి 2011 లో అద్బుతమయిన స్పందన వచ్చింది టి.ఆర్.పి కూడా ఊహించని స్థాయిలో పెరిగింది. ఈ సంవత్సరం ఆగస్ట్ నుండి ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది షూటింగ్ వేసవి కాలం లో మొదలవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు