విభిన్నమయిన పాత్రలో కనిపించబోతున్న బాల కృష్ణ

విభిన్నమయిన పాత్రలో కనిపించబోతున్న బాల కృష్ణ

Published on Jan 3, 2012 2:02 AM IST

మన పరిశ్రమ లో ప్రయోగాలకు వెనకాడని కథానాయుకులలో బాల కృష్ణ ఒకరు తన వేషధారణలో మరియు చిత్రాలలో తను చాలా ప్రయోగాలు చేసారు. తన రాబోయే చిత్రం “అధినాయకుడు” లో తన వేషధారణ చాలా కొత్తగా ఉండబోతుంది. ఇంతకముందే విడుదలయిన పోస్టర్ ల లో తను గడ్డంతో చాలా విభిన్నం గా కనిపించారు. ఈ చిత్రం లో రాజకీయానికి సంభందించిన అంశాలను చర్చించారు ఇందులో బాల కృష్ణ మూడు పాత్రలలో కనిపించబోతున్నారు అందులో రెండు విబిన్నమయిన వేషధారణలు ఇప్పటికే ఆసక్తికరంగా మారాయి.ఇలాంటి వేషధారణ ఇంతక ముందెపుడు బాల కృష్ణ వేయలేదని అంటున్నారు. పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎం.ఎల్.కుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో సలోని మరియు లక్ష్మి రాయ్ లు కథానాయికలుగా చేస్తుండగా కళ్యాణ్ మాలిక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కి విడుదల కావాల్సి ఉంది కాని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఫిబ్రవరి లో విడుదల చేయనున్నట్టు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు