అధినాయకుడు డబ్బింగ్ పూర్తి చేసిన బాలయ్య

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ‘అధినాయకుడు’ చిత్రానికి డబ్బింగ్ చెబుతున్నారు. ఈ రోజుతో బాలకృష్ణ డబ్బింగ్ చెప్పడం పూర్తవుతుంది. ప్రసాద్ ల్యాబ్లో ఈ చిత్రానికి సంభందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. బాలకృష్ణ సరసన సలోని మరియు లక్ష్మి రాయ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో ‘ఆంధ్రుడు’ వంటి చిత్రానికి దర్శకత్వం వహించిన పరుచూరి మురళి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎమ్ఎల్ కుమార్ చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ సంగీతం అందించాడు.

Exit mobile version