అనుష్క,అమలాపాల్ మరియు విక్రం లు ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం “నాన్న”. ఈ చిత్రం జపాన్ ప్రతిష్టాత్మక ఒసాకా ఫిలిం ఫెస్టివల్ లో “అత్యంత అలరించిన చిత్రం” అవార్డ్ ని గెలుచుకుంది. ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత సంవత్సరం తెలుగు మరియు తమిళంలో విడుదలయ్యి విశేషాదరణ పొందింది.ఈ చిత్రం లో విక్రం తన కూతురి బాధ్యత కోసం పోరాడే మానసిక వికలాంగుడిగా నటించారు జి వి ప్రకాశ్ సంగీతం అందిచిన ఈ చిత్రం విమర్శకుల మరియు ప్రజల మెప్పు పొందింది.విక్రం నటన అద్బుతం, అనుష్క మరియు అమలాపాల్ లు వారి పాత్రకు తగ్గ న్యాయం చేశారు. ఈ చిత్ర బృందం కి అభినందనలు.