బాలయ్య ఆదిత్య 369 సీక్వెల్ లో అనుష్క?

బాలయ్య ఆదిత్య 369 సీక్వెల్ లో అనుష్క?

Published on May 25, 2012 5:04 PM IST

బాల కృష్ణ చిత్రం ఆదిత్య 369 సీక్వెల్ గురించి పరిశ్రమలో బాగా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో ప్రధాన కథానాయిక కోసం వెతుకుతున్నారు కాని వర్గాల సమాచారం ప్రకారం అనుష్క దాదాపుగా ఖరారయ్యింది. గతంలో అనుష్క బాలకృష్ణ కలిసి “ఒక్క మగాడు” చిత్రంలో కనిపించారు. గత కొంత కాలంగా అనుష్క ఎటువంటి చిత్రానికి సంతకం చెయ్యకపోయినా దాదాపుగా అన్ని పెద్ద చిత్రాలకు ఈ నటి పేరు వినిపిస్తూ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం అనుష్క చాలా తమిళ చిత్రాలతో బిజీ గా ఉంది. తాండవం మరియు అలెక్స్ పాండియన్ చిత్రాలు ఇందులో ఉన్నాయి. సింగీతం శ్రీనివాస రావు ఈ సీక్వెల్ కి దర్శకత్వం వహించబోతున్నారు. వినోద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొండ కృష్ణమ రాజు సమర్పిస్తున్నారు ఈ ఆగస్ట్ లో ఈ చిత్రం మొదలయ్యే అవకాశాలున్నాయి.

తాజా వార్తలు