అనుపమ్ ఖేర్ తో చర్చల్లో ఉన్న “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్ర బృందం

శ్రీకాంత్ అద్దాల దర్శకత్వం లో వస్తున్న చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం నుండి ప్రకాష్ రాజ్ తప్పుకున్నాక ఆ పాత్ర కోసం మరొక నటుడుని ఎంపిక చేసుకోటం లో బృందం బిజీ గా ఉన్నారు. మహేష్ బాబు మరియు వెంకటేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రం లో వీరి తండ్రి గా గతం లో ప్రకాష్ రాజ్ చేశారు కొన్ని కారణాల వల్ల ఈయన చిత్రం నుండి తప్పుకోటం తో ఇప్పుడు ఈ పాత్ర గురించి అనుపమ్ ఖేర్ ను సంప్రదించినట్టు ఆయనే దృవీకరించారు ఇంతకీ అయన చేస్తారా చెయ్యరా అనేది ఇంకా చెప్పలేదు. ఇదిలా ఉండగా ఈ చిత్ర చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈ బృందం తో మహేష్ బాబు మార్చ్ 12 న చేరబోతున్నారు. అంజల్ మరియు సమతా లు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. మిక్కి జే.మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు కే వి గుహన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు

Exit mobile version