ఎ.ఎన్.ఆర్ కి భారతరత్న ఇవ్వాలి – టి.ఎస్.ఆర్

anr_tsr

విలక్షణ నటుడు మరియు తెలుగు సినిమా లెజెండ్ అయిన డా. అక్కినేని నాగేశ్వరరావు తన 90వ పుట్టినరో జు వేడుకల్ని ఎంతో స్టైలిష్ గా జరుపుకున్నారు. నిన్న సాయంత్రం ఎ.ఎన్.ఆర్ లైఫ్ టైం అచీమ్ మెంట్ అవార్డు మరియు కొంతమందికి స్వర్ణ కంకణం బహుకరించారు. సూపర్ స్టార్ కృష్ణ – విజయ నిర్మలని సత్కరించి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును అందజేశారు.

ఈ వేడుకలో ప్రముఖ పొలిటీషియన్ అయిన టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ఎ.ఎన్.ఆర్ ని పొగడ్తలతో ముంచెత్తాడు. ‘సినిమా రంగ పరంగా ఎ.ఎన్.ఆర్ కి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. ఆయన క్రమశిక్షణ ఇప్పటి వారికి ఆదర్శప్రాయం’ అని అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ ఎ.ఎన్.ఆర్ కి ధన్యవాదాలు చెప్పడమే కాకుండా నేను సినీ రంగంలోకి ప్రవేశించడానికి ఎ.ఎన్.ఆర్ గారే స్ఫూర్తి అని అన్నారు. అలాగే ఈ వేడుకలో కె. రాఘవేంద్ర రావు, ఆర్. నారాయణమూర్తి, ప్రసాద్ తోటకూర, తదితరులను ఈ వేడుకలో సత్కరించారు.

Exit mobile version