మూడు చిత్రాలకు గాను 11 ఆస్కార్ నామినషన్లు సొంతం చేసుకున్న అనిల్ అంబాని

అనిల్ అంబానీ సంస్థ అయిన రిలయన్స్ డ్రీం వర్క్స్ ఆస్కార్ అవార్డులలో మొత్తం మూడు చిత్రాలు “వార్ హార్స్” ,”ది హెల్ప్” మరియు “రియల్ స్టీల్” కు గాను 11 నామినషన్లను సొంతం చేసుకుంది. ఇంత భారి స్థాయిలో ఒక భారతీయ సంస్థ నామినేషన్లు సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. ఉత్తమ చిత్రం కేటగిరి లో – వార్ హార్స్ మరియు ది హెల్ప్ ఉన్నాయి.

స్పీల్ బెర్గ్ దర్శకత్వం వహించిన వార్ హార్స్ చిత్రం ఉత్తమ చిత్రం,సౌండ్ ఎడిటింగ్,సౌండ్ మిక్సింగ్, ఒరిజినల్ స్కోర్(జాన్ విలియమ్స్),ఆర్ట్ డైరెక్షన్ మరియు సినిమాటోగ్రఫీ వంటి ఆరు కేటగిరిలలో ఉంది. ఈ చిత్రం ఫిబ్రవరి 10న ఇండియా లో విడుదల కానుంది. “ది హెల్ప్” చిత్రం ఉత్తమ చిత్రం, ఉతమ నటి(వియోల డేవిస్), ఉత్తమ సహాయ నటి (జెస్సికా చస్తియన్ మరియు ఆక్టావియా స్పెన్సర్), హుగ్ జాక్ మాన్ నటించిన “రియల్ స్టీల్” చిత్రం విజువల్ ఎఫ్ఫెక్ట్స్ విభాగం లో ఎంపికయ్యింది.

Exit mobile version