భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ నుంచి రానున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’, మనదే ఇదంతా.. అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. నవంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో దీని ప్రీరిలీజ్ ఈవెంట్ వివరాలను చిత్రబృందం పంచుకుంది. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్స్‌లో అక్టోబర్ 28 సాయంత్రం ఈ వేడుక జరగనున్నట్లు ప్రకటించింది.
కాగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హాజరుకానున్నట్లు తెలిపింది. అన్నట్టు ‘మాస్ జాతర’కు యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. సినిమా నిడివి 160 నిమిషాలుగా ఖరారు చేసినట్లు టాక్. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఫ్యాన్స్ కూడా ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.
