అల్లు శిరీష్ తెరకు పరిచయమవ్వటానికి సకలం సిద్దమయ్యింది రాధా మోహన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ద్విభాషా చిత్రం “గౌరవం”తో శిరీష్ పరిచయం కానున్నారు. ప్రకాశ్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో యామి గౌతం కథానాయికగా నటిస్తుంది. యామి గౌతం గతంలో రవి బాబు దర్శకత్వంలో తెరకెక్కిన “నువ్విలా” చిత్రంలో నటించింది. ఈ మధ్యనే ఈ భామ నటించిన “విక్కి డోనార్” చిత్రం భారీ విజయం సాదించటంతో ఈ చిత్రంలో ఈమెను తీసుకున్నట్టు తెలుస్తుంది.గతంలో ఈ పాత్రకు అమల పాల్ ని అనుకున్నారు. ఈ చిత్ర ప్రధాన బాగా చిత్రీకరణ మైసూరు లో జూన్ 18 నుండి మొదలవుతుంది. ప్రకాశ్ రాజ్,నాజర్ మరియు ఎల్ బి శ్రీరాం ఈ చిత్రంలో ప్రధాన ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.ప్రీత ఛాయాగ్రహణం అందించనున్నారు. ఈ చిత్రం తెలుగు మరియు తమిళంలో ఒకేసారి చిత్రీకరించనున్నారు.