అల్లరి నరేష్ 3డి చిత్రం “యాక్షన్” ఫస్ట్ లుక్ విడుదల

అల్లరి నరేష్ 3డి చిత్రం “యాక్షన్” ఫస్ట్ లుక్ విడుదల

Published on May 10, 2012 5:00 PM IST

అల్లరి నరేష్ 3డి చిత్రం “యాక్షన్” చిత్ర ఫస్ట్ లుక్ ఈరోజు నరేష్ పరిశ్రమకి పరిచయమయ్యి పది సంవత్సరాలు అయిన సందర్భంగా విడుదల చేశారు. ఈ చిత్రానికి అనిల్ సుంకర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 15 నుండి ఈ చిత్ర రెండవ షెడ్యూల్ చిత్రీకరణ మొదలు కానుంది. ఈ షెడ్యూల్ తో మొదటి అర్ధ భాగం చిత్రీకరణ మొత్తం పూర్తి కానుంది. రెండవ అర్ధ భాగంలో కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తారు. కిక్ శ్యాం,వైభవ్,రాజ సుందరం,స్నేహ ఉల్లాల్ మరియు కామ్న జేత్మలనిలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు సుంకర రామ్ బ్రహ్మం ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు బప్పి లహరి తనయుడు బప్పా లహరి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు తమన్ నేఫధ్య సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు