గాయకుడిగా మారిన కామెడీ కింగ్

గాయకుడిగా మారిన కామెడీ కింగ్

Published on Apr 29, 2012 6:35 PM IST

మన తెలుగు నటుల్లో చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, సిద్ధార్థ్ వంటి తరాలు నటనలో కాకుండా అప్పుడప్పుడు పాటలు పాడి తమ సరదా తీర్చుకుంటున్నారు. ఇప్పుడు వారి సరసన కామెడీ కింగ్ అల్లరి నరేష్ కూడా చేరిపోయాడు. ప్రస్తుతం తను ‘సుడిగాడు’ అనే సినిమాలో ఒక గమ్మత్తైన పాట పాడాడు. ఈ పాటలో సాహిత్యం చాలా గమ్మత్తుగా, సరదాగా ఉంటుంది. తమిళంలో వచ్చిన ‘తమిళ్ పడం’ అనే సినిమాని తెలుగులో సుడిగాడు పేరుతో రూపొందిస్తున్నారు. భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆయనే స్వయంగా నిర్మిస్తున్నారు. వేసవి సెలవుల్లో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించడానికి ఈ చిత్రం రెడీ అవుతుంది.

తాజా వార్తలు