అల్లరి నరేష్ జి నాగేశ్వర్ రెడ్డి ల కలయికలో మరో చిత్రం

అల్లరి నరేష్ జి నాగేశ్వర్ రెడ్డి ల కలయికలో మరో చిత్రం

Published on Jun 29, 2012 9:00 PM IST

అల్లరి నరేష్ తిరిగి జి నాగేశ్వర్ రెడ్డితో జతకట్టనున్నారు.గతంలో “సీమ శాస్త్రి” మరియు “సీమ టపాకాయ్” వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ రెండు చిత్రాలలోనూ నరేష్ కథానాయకుడిగా నటించారు. ఈ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాదించాయి.రేపు అల్లరి నరేష్ జన్మదినం పురస్కరించుకొని నిర్మాత అమ్మి రాజు ఈ చిత్రం గురించిన విషయాలను వెల్లడించారు. ఈ చిత్రం అక్టోబర్ లో విజయ దశమి రోజు చిత్రీకరణ మొదలు పెట్టుకుంటుంది. డిసెంబర్ కి ఈ చిత్రాన్ని పూర్తి చెయ్యాలని నిర్మాతలు అనుకుంటున్నారు.ఈ చిత్రం కోసం సూపర్ స్టార్ కృష్ణ చిత్రం నుండి ఒక ప్రముఖ పాటను రీమిక్స్ చెయ్యనున్నారు. ఈ చిత్రంతో కొత్త కథానాయిక పరిచయం కానుంది చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు. త్వరలో అల్లరి నరేష్ “సుడిగాడు” విడుదల కానుంది ఇది కాకుండా అల్లరి నరేష్ చేతిలో మూడు చిత్రాలున్నాయి ఇందులో “యాక్షన్” మరియు “నెల తక్కువోడు” కూడా ఉన్నాయి.

తాజా వార్తలు