అల్లరోడికి ‘అల్లరి’కి పదేళ్ళు

అల్లరోడికి ‘అల్లరి’కి పదేళ్ళు

Published on May 10, 2012 6:36 PM IST

కామెడీ కింగ్ అల్లరి నరేష్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి నేటికి సరిగ్గా పదేళ్ళు. అవును ఆయన నటించిన మొదటి చిత్రం ‘అల్లరి’ 10 – 05 – 2002 నాడు విడుదలైంది. మినిమమ్ గ్యారంటీ హీరోగా నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టె హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ కెరీర్లో ఈ రోజు ఒక మైలు రాయి అని చెప్పుకోవాలి. ఈ ఆనందాన్ని తన ట్విట్టర్లో చెబుతూ ‘ ఈ రోజుతో నా కెరీర్ మొదలయ్యి పదేళ్ళు అయింది. మీ ఆదరణ అభిమానం లేనిదే ఇది సాధ్యం కాదంటూ’ తెలిపాడు. ప్రముఖ కామెడీ డైరెక్టర్ ఈ.వి.వి సత్యనారాయణ కొడుకుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ అతి కొద్దికాలంలోనే మంచి డిమాండ్ ఉన్న హీరోగా ఎదిగిన అల్లరి నరేష్ ప్రస్తుతం ‘సుడిగాడు’ మరియు మరో సోషియో ఫాంటసి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు