నా సిక్స్ ప్యాక్ వెనుక కఠోర శ్రమ ఉంది: సునీల్

సునీల్ యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. అందుకే నేను 6 ప్యాక్ బాడీ చేసి ప్రేక్షకులకు చూపించాలని నిర్ణయించుకున్నాను అంటున్నాడు సునీల్. తనకు ఈ బాడీ రావడానికి కారణం తన గురువు ఖలీల్ కారణం. అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ బాడీ వెనుక కూడా ఖలిల్ ఉన్నాడు. సునీల్ బాడీ కోసం సర్జరీ చేయించుకున్నాడు అంటూ పుకార్లు కూడా వచ్చాయి. కానీ ఈ ఈ కసరత్తు వెనుక మూడు సంవత్సరాలు కటోర శ్రమ దాగి ఉంది. మొదటి సంవత్సరం మొత్తం 108 కిలోలు ఉన్న నా బరువు తగ్గించడం కోసం కసరత్తు చేసాను. తరువాత రెండు సంవత్సరాలు బాడీ షేప్ రావడానికి కసరత్తు చేశాను. 44 ఉన్న నా నడుము సైజ్ 31 కి వచ్చింది అలాగే దాదాపు 30 కిలోల వరకు బరువు తగ్గాను అంటున్నాడు సునీల్.

Exit mobile version