జనవరి నుంచి నాగ చైతన్య “గౌరవం”

Naga Chaitanya Gauravam
ఇది అధికారిక సమాచారం.. రాధా మోహన్ ద్విభాషా చిత్రం ‘గౌరవం’ లో నాగచైతన్య నటించబోతున్నాడు. దీనికి సంబంధించి నాగచైతన్య – రాధా మోహన్ మధ్య చర్చలు జరుగుతున్నాయంటూ కొన్నివారాల క్రితమే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆకాశమంత, గగనం తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన రాధా మోహన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు.

ఫ్యామిలీ డ్రామాగా సాగే ఈ చిత్రం 2012 జనవరిలో సెట్స్ పైకి వెళ్ళబోతుంది. ఎస్ఎస్ తమన్ ఈ సినిమా కు సంగీతం అందించబోతున్నారు. ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

నాగ చైతన్య రాబోవు రెండు సినిమాలూ (బెజావాడ, ఆటోనగర్ సూర్య) యాక్షన్ సినిమాలు కాగా, విభిన్న పాత్రల్లో నటించాలన్న ఉద్దేశ్యంతోనే నాగచైతన్య ‘గౌరవం’ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది

Exit mobile version