ఎంఎం కీరవాణి రిటైర్మెంట్ డేట్.!

ఎంఎం కీరవాణి రిటైర్మెంట్ డేట్.!

Published on Jan 30, 2014 12:00 PM IST

keeravani
టాలీవుడ్ లో ఎంఎం కీరవాణిగా, కోలీవుడ్ లో మరగతమణిగా, బాలీవుడ్ లో ఎంఎం క్రీమ్ గా పలు భాషల్లో పలు పేర్లతో తన సంగీతంతో గత 24 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన ఆయన తాజాగా తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు.

‘నేను 1989 డిసెంబర్ 9న చెన్నై ప్రసాద్ స్టూడియోస్ లో నా మొదటి పాటని రికార్డు చేసాను. ఆ రోజే నేను 2016 డిసెంబర్ 8న రిటైర్మెంట్ తీసేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా రిటైర్మెంట్ ని నా అసోసియేట్స్, మ్యుజీషియన్స్ తో కలిసి హైదరాబాద్ ప్రసాద్ స్టూడియోలో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. కాని దానికి ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన నా అభిమానులందరికీ నా ధన్యవాదాలని’ ఎంఎం కీరవాణి తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు.

ఎంఎం కీరవాణి ప్రస్తుతం అనామిక, బాహుబలి సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు