మన టాలీవుడ్ నుంచి ప్రస్తుతం యువ హీరోస్ నుంచి పలు సాలిడ్ కామెడీ ఎంటర్టైనర్స్ వస్తున్నాయి. మ్యాడ్ అని ఆయ్ అని.. జాతి రత్నాలు ఇలా సాలిడ్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక ప్రస్తుతం మరో మ్యాడ్ రైడ్ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధంగా ఉంది.
ఆ చిత్రమే “మిత్ర మండలి” యంగ్ అండ్ టాలెంటెడ్ నటులు ప్రియదర్శి, విష్ణు ఓయ్ అలాగే రాగ మయూర్ ఇంకా ప్రసాద్ బెహరా కలయికలో వస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ మంచి మ్యాడ్ ఫన్ లో కనిపిస్తుంది అని చెప్పాలి. దర్శకుడు విజయేందర్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఈ నలుగురు సహా కమెడియన్ సత్య ఇంకా వెన్నెల కిషోర్ లపై విజువల్స్ కూడా టీజర్ లో మంచి ఫన్ ని జెనరేట్ చేసాయి.
అలాగే నటి నిహారిక ఎన్ ఎం సాలిడ్ పాత్రలో కనిపిస్తుంది. ఇక ఈ గ్యాంగ్ లో వీటీవి గణేష్ కి ఏదో క్లాష్ ఉంటుంది అనిపిస్తుంది. అలాగే వీటీవీ గణేష్ పై చూపించిన కొన్ని పేరడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. ఇలా మొత్తానికి మరో క్రేజీ ఫన్ డ్రామా టాలీవుడ్ నుంచి రాబోతుంది అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి ఆర్ ఆర్ ధృవన్ సంగీతం అందించగా వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి