టాలీవుడ్ యంగ్ టాలెంట్ ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్ అలాగే ప్రసాద్ బెహరా లీడ్ రోల్ లో నిహారిక ఎన్ ఎమ్ ఫీమేల్ లీడ్ లో నటించిన లేటెస్ట్ చిత్రమే “మిత్ర మండలి”. యువ దర్శకుడు విజయేందర్ ఎస్ తెరకెక్కించిన ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ కట్ ని అయితే ఇపుడు రిలీజ్ చేశారు.
మరి ఈ ట్రైలర్ కట్ మాత్రం అదిరింది అని చెప్పవచ్చు. ఫుల్ ఫన్ గ్యారెంటీ అన్నట్టుగా మంచి ప్రామిసింగ్ గా ఉంది. వెన్నెల కిషోర్ మొదలుకొని ఒకో యంగ్ హీరోకి ఒకో సాలిడ్ కామెడీ ట్రాక్ అండ్ మంచి హిలేరియస్ మూమెంట్స్ తో ట్రైలర్ కనిపిస్తుంది. ఇక జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ కే వి, కమెడియన్ సత్యలు తమ ట్రాక్ లతో మరింత అలరించేలా కనిపిస్తున్నారు.
అలాగే హీరోయిన్ నిహారిక కూడా తన రోల్ లో పర్ఫెక్ట్ గా కనిపిస్తుండగా ఆమె చుట్టూనే తిరిగే ఫన్ లవ్ స్టోరీగా ఇది కనిపిస్తుంది. ఇక ఈ ట్రైలర్ లో కెమెరా వర్క్ గాని ఆర్ ఆర్ ధృవన్ సంగీతం గాని మంచి ఇంప్రెసివ్ గా ఉన్నాయి. మొత్తానికి మాత్రం మేకర్స్ ఒక సాలిడ్ ఎంటర్టైనర్ ని ఈ దీపావళికి తీసుకొస్తున్నారని చెప్పవచ్చు.