టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మిత్ర మండలి’ దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాను దర్శకుడు విజయేంద్ర తెరకెక్కిస్తుండగా ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం, విష్ణు ఓఇ, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది.
ఇక ఇప్పుడు ఈ చిత్రం సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమాలోని కామెడీ ప్రక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని.. ఇలాంటి కామెడీని ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు చూసుండరు అంటూ చిత్ర యూనిట్ ఈ మూవీపై హైప్ క్రియేట్ చేస్తోంది.
ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సత్య, విటీవి గణేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.