యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘మిర్చి’ సినిమా ఆడియో జనవరి 5న రిలీజ్ కానుంది. ఈ సినిమా ఆడియోకి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా సాంగ్స్ స్టూడెంట్స్, యంగ్ జెనరేషన్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ ఇంత మంచి మ్యూజిక్ అందించినందుకు ప్రభాస్ ఫాన్స్ ఆయన్ని మెచ్చుకుంటున్నారు.
ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ సినిమా ఆడియో జనవరి 7 నుంచి మార్కెట్లో లభిస్తున్నాయి. అనుష్క – రిచా గంగోపాధ్యాయ లతో ప్రభాస్ రొమాన్స్ చేసిన ఈ సినిమాకి కొరటాల శివ డైరెక్టర్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.