మిర్చి విడుదల తేదీ ఖరారు

మిర్చి విడుదల తేదీ ఖరారు

Published on Jan 19, 2013 6:39 PM IST

Mirchi

ప్రభాస్ రానున్న చిత్రం “మిర్చి” ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 7న విడుదలకు సిద్దమయ్యింది. కొరటాల శివ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రాన్ని ప్రభాస్ సన్నిహితులు వంశీ మరియు ప్రమోద్ నిర్మించారు. అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ్ ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కనిపించనున్నారు. ఈ చిత్రం పల్నాడు నేపధ్యంలో సాగనుంది. దేవిశ్రీ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోనగా చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించబోతుందని చిత్ర వర్గాలు చెప్తున్నాయి. ఈ చిత్రంలో చాలా భాగం హైదరాబాద్, తెంకాసి మరియు యూరప్లలో చిత్రీకరించారు. ఈ ఏడాది ప్రభాస్ మొదటి చిత్రం ఇదే ఈ చిత్రం తరువాత ప్రభాస్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చిత్రాన్ని మొదలు పెడతారు ఈ చిత్రానికి “బహుబలి” అనే పేరుని పరిశీలిస్తున్నారు.

తాజా వార్తలు