యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమా అద్భుతమైన టాక్ తో మొదటివారం నైజాంలో రికార్డ్ కలెక్షన్స్ సాధించే దిశగా దూసుకుపోతోంది. ఈ మూవీ ఫస్ట్ వీక్ 9 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రభాస్ స్టార్ ఇమేజ్, అలాగే సినిమాలో ప్రభాస్ లుక్ సినిమాకి హైలైట్. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాని ప్రమొద్ – వంశీ సంయుక్తంగా నిర్మించారు. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం
అందించాడు.
‘మిర్చి’ సినిమా ప్రభాస్ కెరీర్లోనే టాప్ గ్రాసర్ గా నిలనుంది. ఫిబ్రవరిబిజినెస్ కి సరైన సీజన్ కాదు అని చెప్పిన ట్రేడ్ పండితులు ఈ సినిమా కలెక్షన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు.