యువ హీరో తేజ సజ్జ నటించిన లేటెస్ట్ మరో ఇంట్రెస్టింగ్ చిత్రమే “మిరాయ్”. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ సినిమా థియేటర్స్ లో మంచి హైప్ నడుమ రిలీజ్ కి వచ్చి అదే రీతిలో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. డే 1నుంచే సాలిడ్ నంబర్స్ నమోదు చేసిన ఈ సినిమా అక్కడ నుంచి నిన్న వర్కింగ్ డే సోమవారం కూడా స్ట్రాంగ్ వసూళ్లు రాబట్టి అదరగొట్టింది.
ఇలా మొత్తం 4 రోజుల రన్ కి మిరాయ్ ఏకంగా 90 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక మొత్తంగా ఈ సినిమా 91.45 కోట్ల గ్రాస్ ని అందుకొని నెక్స్ట్ స్టాప్ గా 100 కోట్ల మార్క్ ని చేరుకోడానికి సిద్ధంగా ఉంది. మరి ఇది ఈ ఐదో రోజే కొట్టేసినా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పవచ్చు. ఇక ఈ భారీ సినిమాలో మంచు మనోజ్ పవర్ఫుల్ విలన్ గా నటించగా గౌర హరి సంగీతం అందించారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.
#SuperYodha's blazing run continues to dominate the Box-office ❤️????
₹91.45 Cr Worldwide Gross in 4 DAYS for #BrahmandBlockbusterMirai ????????????
Experience India’s most ambitious action adventure #MIRAI with your families only on Big Screens ????
Superhero… pic.twitter.com/uqocTjqrfk
— People Media Factory (@peoplemediafcy) September 16, 2025