యూఎస్ లో “మిరాయ్” అదే హోల్డ్ తో అదరగొడుతుందిగా!

యూఎస్ లో “మిరాయ్” అదే హోల్డ్ తో అదరగొడుతుందిగా!

Published on Sep 18, 2025 8:00 AM IST

Mirai Movie

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా రితికా నాయక్ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “మిరాయ్” భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా వాటిని అందుకొని అదరగొట్టింది. ఇక తెలుగు స్టేట్స్ లోనే కాకుండా హిందీ సహా యూఎస్ మార్కెట్ లో కూడా మిరాయ్ స్ట్రాంగ్ హోల్డ్ తో దూసుకెళ్తుంది.

అయితే యూఎస్ మార్కెట్ లో మాత్రం మిరాయ్ మంచి హోల్డ్ ని కనబరుస్తుంది అని చెప్పాలి. అక్కడ నిన్ననే 2 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని దాటిన ఈ చిత్రం నేటికి ఇంకో లక్ష డాలర్స్ గ్రాస్ క్రాస్ చేసి 2.1 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకుంది. ఇది కూడా వీక్ డే లోనే కావడం విశేషం. దీనితో మిరాయ్ మాత్రం లాంగ్ రన్ లో గట్టి మార్క్ దగ్గరే ఆగేలా ఉందని చెప్పవచ్చు.

తాజా వార్తలు