యూఎస్ మార్కెట్ లో ఆగని ‘మిరాయ్’

Mirai

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా రితికా నాయక్ హీరోయిన్ గా మంచు మనోజ్ విలన్ పాత్రలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “మిరాయ్”. భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించిన ఈ సినిమా తేజ సజ్జ కెరీర్ లో మరో సాలిడ్ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా సాలిడ్ వసూళ్లు అందుకున్న ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో కూడా ఇదే రీతిలో అదరగొడుతుంది.

ఇలా యూఎస్ లో 2 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేసిన ఈ సినిమా ఇపుడు 2.3 మిలియన్ డాలర్స్ మార్క్ దగ్గరకి చేరుకొని ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ లోనే దూసుకెళ్తుంది. ఇక ఈ వీకెండ్ పూర్తయ్యే సరికే 2.5 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని సునాయాసంగా దాటేస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version