మిలియన్ డాలర్ పిక్.. మీమ్ గాడ్ తో పవన్ హ్యాపీ మూమెంట్ వైరల్

Pawan-kalayan--bhramanadham

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అవైటెడ్ చిత్రమే “హరిహర వీరమల్లు”. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా రేపు బుధవారం రాత్రి నుంచే షోస్ తో ట్రీట్ ని అందించనుంది. ఇలా నిన్ననే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకున్న ఈ సినిమా ఈవెంట్ కి మీమ్ గాడ్ బ్రహ్మానందం కూడా వచ్చారు.

మరి బ్రహ్మానందం ఇచ్చిన స్పీచ్ మరింత స్పెషల్ గా మారగా పవన్ కళ్యాణ్ తో కలిసి బయటకొచ్చిన ఓ పిక్ మంచి వైరల్ గా మారింది. ముందు వరుసలో పక్క పక్కనే కూర్చున్న ఈ ఇద్దరూ ఎంతో ఆనందంగా నవ్వుతూ కనిపించిన పిక్ వారి ఫ్యాన్స్ కి ట్రీట్ గా నిలిచింది.

వింటేజ్ లుక్స్ లో పవన్ ఇంకో పక్క మీమ్ గాడ్ ల హ్యాపీ మూమెంట్ ప్రెజెన్స్ తో ఈ స్పెషల్ స్నాప్ ఒక మిలియన్ డాలర్ పిక్ లా నిలిచింది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించగా ఈ జూలై 24న గ్రాండ్ గా సినిమా విడుదల కాబోతుంది.

Exit mobile version