నా కెరీర్ ని మలుపు తిప్పే సినిమా – శ్రియ

నా కెరీర్ ని మలుపు తిప్పే సినిమా – శ్రియ

Published on Jan 20, 2013 3:09 PM IST

Midnights--Children
శ్రియ సరన్ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకూ చాలామంది స్టార్ హీరోలతో నటించిన శ్రియ ప్రస్తుతం ఓ మెట్టు పైకెక్కి ఏకంగా ‘మిడ్ నైట్ చిల్డ్రన్స్’ అనే హాలీవుడ్ సినిమాలో నటించింది. ఈ సినిమా గురించి శ్రియ మాట్లాడుతూ ‘ ఈ సినిమాకి పనిచేసే అరుదైన అవకాశం నాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. దీప మెహతాతో కలిసి పనిచేయడంతో నా కల నెరవేరింది. సినిమాలో నా పాత్ర చాలా బాగా వచ్చింది. నా కెరీర్ ని మార్చేసే సినిమా అవుతుందని బాగా నమ్ముతున్నానని’ అంది.

ఇప్పటికే చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడిన ఈ సినిమా పలువురి విమర్శకుల ప్రశంశలు అందుకుంది. టాలీవుడ్ హీరో సిద్దార్థ్ కూడా ఓ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ఫిబ్రవరి 1వ తేదీన ఇండియాలో విడుదల కానుంది.

తాజా వార్తలు